NTV Telugu Site icon

Arun Subramanian: అరుణ్‌ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం.. న్యూయార్క్‌కు తొలి దక్షిణాసియా న్యాయమూర్తి

Arun Subramanian

Arun Subramanian

Arun Subramanian: భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌ న్యాయవాది అరుణ్ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా అరుణ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్ చేశారు. దీంతో అరుణ్ సుబ్రమణియన్ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి అయిన మొదటి భారతీయ అమెరికన్ అయ్యారు. యూఎస్‌ సెనేట్ సుబ్రమణియన్ నామినేషన్‌ను 58-37 ఓట్ల తేడాతో ధృవీకరించింది. “అరుణ్ సుబ్రమణియన్ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కి వెళ్లారు. ఆయన సివిల్ లిటిగేషన్‌లోని ప్రతి అంశంలో ప్రత్యక్షంగా నిమగ్నమై ఉన్నారు. ఫెడరల్ న్యాయవ్యవస్థలోని ప్రతి స్థాయిలో పనిచేశారు. ఈ బెంచ్‌లో పనిచేసిన మొదటి దక్షిణాసియా న్యాయమూర్తి కూడా ఆయనే” అని సెనేట్ జ్యుడిషియరీ కమిటీ ట్వీట్ చేసింది. న్యూయార్క్ జిల్లా కోర్టులో సేవలందించనున్న మొదటి దక్షిణాసియా న్యాయమూర్తిగా సుబ్రమణియన్ కావటం విశేషం.

Read Also: Indian Navy: ముంబై తీరంలో ‘ధృవ్’ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో 1979లో అరుణ్ సుబ్రమణియన్ జన్మించారు. 1970 దశకంలో ఆయన తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లారు. సుబ్రమణియన్ తండ్రి పలు కంపెనీల్లో కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌గా పనిచేశారు. తల్లి కూడా అనేక విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సుబ్రమణియన్ 2004లో కొలంబియా లా స్కూల్ నుండి జ్యూరియస్ డాక్టర్, 2001లో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి బీఏ పట్టా పొందారు. అరుణ్ సుబ్రమణియన్ 2006 నుంచి 2007 వరకు యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టులో జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్‌కు క్లర్క్‌గా కూడా పనిచేశారు. భారతీయ సంతతికి చెందిన సుబ్రమణియన్ ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు, అనేక మంది వ్యక్తులపై తప్పుడు క్లెయిమ్‌లను ఎదుర్కొంటున్న వారి తరపున వాదించారు. అంతేకాక, చైల్డ్ ఫోర్నోగ్రఫీలో ట్రాఫికింగ్ బాధితులు తరపున, అన్యాయమైన కేసుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి తరపున అరుణ్ వాధించారు. అరుణ్ సుబ్రమణియన్ ప్రస్తుతం సుస్మాన్ గాడ్‌ఫ్రే 2022 ప్రో బోనో కమిటీకి ఛైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. దేశంలోని ప్రముఖ న్యాయ పత్రికలలో ఒకటైన కొలంబియా లా రివ్యూకు దీర్ఘకాల డైరెక్టర్‌గా కూడా ఉన్నారని సుస్మాన్ గాడ్‌ఫ్రే అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

Show comments