Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Artemis Ii Launch Humans Set To Return To Moon After 50 Years

50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

Published Date :March 30, 2026 , 1:33 pm
By Kothuru Ram Kumar
50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్‌లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్ ఆపరేషన్స్‌ లో భాగంగా రాకెట్‌లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఏప్రిల్ 1న సాయంత్రం 6:15 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఒకవేళ ఈ తేదీన ప్రయోగం జరగకపోతే.. ఏప్రిల్ 6 వరకు లోపు, లేదా అది కూడా కుదరకపోతే ఏప్రిల్ 30న ప్రయోగించనున్నారు.

ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

ఈ మిషన్‌ లో మొత్తం నలుగురు వ్యోమగాములు పాల్గొంటున్నారు. రీడ్ విలియమ్స్ కమాండర్‌ గా, విక్టర్ గ్లోవర్ పైలట్‌గా, క్రిస్టినా కొచ్ మిషన్ స్పెషలిస్టుగా, అలాగే కెనడా స్పేస్ ఏజెన్సీకి చెందిన జెరెమీ హాన్సెన్ సభ్యుడిగా ఉంటారు. ఈ ప్రయోగం అనంతరం స్పేస్‌ క్రాఫ్ట్ మొదట “లో ఎర్త్ ఆర్బిట్‌”లోకి ప్రవేశించి.. దాదాపు 24 గంటల తర్వాత ‘ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్’ ద్వారా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ మిషన్‌ లో ముఖ్య ఘట్టం ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ “ఫ్లైబై” చేయడం. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం రాత్రి 11:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఒక గంటలోనే ఈ వ్యోమగాములు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించిన మనుషులుగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఉన్న అపోలో-13 మిషన్ రికార్డును ఇప్పుడు అధిగమించే అవకాశం ఉంది.

Kavitha: సీఎం రేవంత్‌రెడ్డికి కవిత లేఖ.. నాడు కేసీఆర్‌కు రాసిన లేఖను గుర్తు చేసిన జాగృతి అధినేత్రి!

ఏప్రిల్ 7న ఈ మిషన్‌ లో ఉన్న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని సిబ్బందితో ఆడియో సంభాషణ జరపనున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం ఏప్రిల్ 8న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 9న వ్యోమగాములు అంతరిక్షం నుంచే మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మిషన్ ఏప్రిల్ 10న ముగియనుంది. పసిఫిక్ మహాసముద్రంలో శాన్ డియాగో తీరానికి సమీపంలో స్ప్లాష్‌ డౌన్ జరగనుంది. ఆ తరువాత అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక నౌక ద్వారా వ్యోమగాములు, స్పేస్‌ క్రాఫ్ట్‌ ను సురక్షితంగా తీసుకువస్తారు. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు కీలక దశగా భావిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Artemis II mission
  • Artemis program
  • humans to moon
  • Kennedy Space Center launch
  • lunar flyby mission

తాజావార్తలు

  • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!

  • Tamil Nadu: నామినేషన్ వేసిన స్టాలిన్, విజయ్.. ర్యాలీలతో ప్రచారం జోరు

  • ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!

  • Maoist Narayana: లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ.. ఏపీ నక్సల్స్ ఫ్రీ స్టేట్!

  • Komaram Bheem District: అంజన్న సన్నిధిలో అద్భుతం.. హనుమంతుడికి పూజలు చేసిన వానరం..

ట్రెండింగ్‌

  • Migraine in Women: మహిళల్లో అమాంతంగా పెరుగుతున్న ‘మైగ్రేన్’ సమస్య.. కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ.!

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions