Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలో ‘మమ్మీ’ స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను ఆయన చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అయింది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా రౌడీ స్టార్ ఓకే చెప్పాడు.
Read Also:Pawan Kalyan: పిఠాపురం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకు సక్సెస్‌ను అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా రూపొందబోతుంది. గతంలోనే వీరి కాంబో మూవీని ప్రకటించినా మేకింగ్‌కు కాస్త టైం పట్టింది. ఎట్టకేలకు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదటైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి అదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈసారి కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకున్నారని, విజయ్ దేవరకొండ సైతం ఆ కాన్సెప్ట్ విని ఫిదా అయినట్లు సమాచారం.
Read Also:Harsha Sai : ఎట్టకేలకు హైదరాబద్ కు యూట్యూబర్ హర్ష సాయి..
విజయ్ దేవరకొండతో రాహుల్ సంకృత్యాన్ రూపొందించబోతున్న సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ సినిమాల్లో విలన్‌గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ను తెలుగు సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఈ దక్షిణాఫ్రికా నటుడు పాత్ర మెచ్చితే ఏ భాషలో నటించేందుకైనా రెడీగా ఉంటారని తెలుస్తోంది. కనుక దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఆయనను ఒప్పించగలడా అనేది చూడాలి. కథలో బలమైన పాత్ర కనుకే ఆయనతో చేయించాలని రాహుల్ భావిస్తూ ఉంటాడని సమాచారం అందుతోంది. విజయ్ దేవరకొండ 14వ సినిమాగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందబోతుంది. ఒక భారీ పీరియాడికల్ వార్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందట
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!