Site icon NTV Telugu

Arjun Tendulkar: ముంబై జట్టుకు అర్జున్ టెండూల్కర్ బైబై.. కొత్త టీం ఏదంటే!

Arjun Tendulkar

Arjun Tendulkar

Arjun Tendulkar: చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఇండియన్ క్రికెట్‌కు దేవుడిగా అభివర్ణించే వ్యక్తి సచిన్ టెండూల్కర్. అంతటి గొప్ప వ్యక్తి కొడుకుగా క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టిన వ్యక్తి అర్జున్ టెండూల్కర్. ఆయన తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. అర్జున్ టెండూల్కర్ IPL 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కాకుండా వేరే జట్టుకు ఆడవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల మార్పిడికి సంబంధించి ముంబై ఇండియన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అర్జున్ టెండూల్కర్‌ను మార్చాలని MI కోరుకుంటోంది. దీంతో ఆయన మార్పు పక్కాగా జరిగే అవకాశం ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: 125cc Bikes: రూ. లక్ష లోపు ధరలో.. టాప్ 5 పవర్ ఫుల్ 125cc బైక్స్ ఇవే.. మీరూ ఓ లుక్కేయండి

రెండవ అతిపెద్ద ట్రేడ్ కావచ్చు..
ఇప్పటికే రవీంద్ర జడేజా- సంజు శాంసన్ ట్రేడ్ విస్తృతంగా చర్చించబడుతున్న క్రమంలో అర్జున్ టెండ్కూలర్ – శార్దూల్ ఠాకూర్ ట్రేడ్ ఈ సీజన్‌లో రెండవ అతిపెద్ద ట్రేడ్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రేడ్ డీల్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇద్దరు ఆటగాళ్లను ఫ్రాంచైజీల మధ్య స్వేచ్ఛగా మార్చుకోవచ్చు. సరళంగా చెప్పాలంటే దీనిని మొత్తం నగదు బదిలీ అని పిలుస్తారు. పలు నివేదికల ప్రకారం.. “శార్దుల్ ఠాకూర్, అర్జున్ టెండూల్కర్‌ల ట్రేడ్‌కు సంబంధించి లక్నో సూపర్ జెయింట్స్ – ముంబై ఇండియన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ ట్రేడ్ నిబంధనల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్ల మార్పిడిని అధికారికంగా ప్రకటించాలి. ఇప్పటి వరకు ఈ నిర్ణయానికి సంబంధించి ఫ్రాంచైజ్ జట్లు ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పలు నివేదికల ప్రకారం.. ముంబై క్రికెట్ వర్గాలు ఎంఐలో ఆటగాళ్ల మార్పిడికి అవకాశం ఉందని ధృవీకరించాయి. రాబోయే కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.

దేశీయ క్రికెట్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శార్దూల్ ఠాకూర్‌ను గత సీజన్‌కు ముందు 2025 IPL మెగా వేలంలో అమ్ముడుపోక పోవడంతో LSG తన బేస్ ధర రూ.2 కోట్లకు సంతకం చేసింది. ఠాకూర్ LSG తరపున 10 మ్యాచ్‌లు ఆడాడు. ఆ ఈ క్రికెటర్ బ్యాట్‌తో (18 పరుగులు) చేసి, బంతితో 13 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ముంబై ఇండియన్స్ తరుఫున అర్జున్ టెండూల్కర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ప్రవేశించడం ఒక సవాలుగా మారింది. అతను రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. రెండు వేలంలోనూ ముంబై ఇండియన్స్ అతన్ని రూ.20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా, గత రెండు ఎడిషన్లలో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 2023లో మూడు, గత ఏడాది ఒక మ్యాచ్ ఆడాడు. మొత్తం మీద అర్జున్ టెండూల్కర్ ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లలో 13 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం అర్జున్ టెండూల్కర్ దేశీయ క్రికెట్‌లో ముంబై నుంచి గోవా జట్టుకు మారాడు. అప్పటి నుంచి 21 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. దేశీయ క్రికెట్, ఐపీఎల్ రెండింటిలోనూ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి ప్రవేశించడం అర్జున్ టెండూల్కర్‌కు ఎల్లప్పుడూ సవాలుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Educated Terrorists: 24 ఏళ్లలో 36 సంఘటనలు.. ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఎప్పుడు ప్రారంభమైంది!

Exit mobile version