Site icon NTV Telugu

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టిక్కెట్లు విడుదల

Ttd

Ttd

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇవాళ ఆన్ లైన్ లో ఏప్రిల్ నెల దర్శన టిక్కెట్లు విడుదలకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదలవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల వ‌సంతోత్సవాల‌ టికెట్లను 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Exit mobile version