Site icon NTV Telugu

Naveen Patnaik: ఎన్నికల వేళ బీజేడీకి షాక్.. నటుడు, కీలక నేత గుడ్‌ బై

Bjd

Bjd

సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో అధికార బీజేడీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు అరిందమ్ రాయ్ శుక్రవారం బిజూ జనతాదళ్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రతిపక్ష బీజేపీలో చేరారు. అధికార పార్టీ తనను పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. BJD ఆర్గనైజింగ్ సెక్రటరీ PP దాస్‌కి దగ్గరి బంధువు అయిన రాయ్.. BJD అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపిన కొన్ని గంటల్లో కాషాయ కండువా కప్పుకున్నారు.

బీజేడీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని రాయ్ పేర్కొన్నారు. బీజేడీలో ప్రజలకు సేవ చేసే అవకాశం ఎవరికీ దొరకదన్నారు. అందుకోసమే పార్టీని విడిచిపెట్టినట్లు వెల్లడించారు. బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి సమక్షంలో బీజేపీలో చేరిన తర్వాత రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేడీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు రాయ్ లేఖ రాశారు. తాను నా నాయకుడిని కలవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాను.. కానీ దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం రాలేదని అన్నారు. కటక్ జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో, జగత్‌సింగ్‌పూర్, కోరాపుట్‌లోని తిర్టోల్ ఉపఎన్నికల్లో, జిల్లా పరిషత్ మరియు మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేడీ తరపున తీవ్రంగా ప్రచారం చేశానని గుర్తుచేశారు. అయినా తన పనిని గుర్తించలేదని.. తనపై పగ పెంచుకోవద్దని లేఖలో రాయ్ పేర్కొన్నారు.

 

 

 

Exit mobile version