Site icon NTV Telugu

AR Murugadoss : ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న మురుగదాస్..?

Whatsapp Image 2023 07 01 At 3.59.55 Pm

Whatsapp Image 2023 07 01 At 3.59.55 Pm

ఏ.ఆర్‌ మురుగదాస్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.తమిళ్ ఇండస్ట్రీ లో శంకర్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్‌ వున్న దర్శకుడు ఏ.ఆర్‌ మురుగదాస్‌. అప్పట్లో మురుగదాస్ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఓ వైపు సోషల్ మెసేజ్‌ ఇస్తూనే మరోవైపు కమర్షియల్ అంశాలు బాగా దట్టించి బ్లాక్‌బస్టర్‌ హిట్స్ సాధించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాల కు మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులో మొదట మెగాస్టార్ చిరంజీవితో  స్టాలిన్ సినిమాను తెరకెక్కించాడు మురుగదాస్. ఆ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా మంచి సినిమా గా పేరు తెచ్చిపెట్టింది..తెలుగులో మురుగదాస్‌ మహేష్ తో రెండవ సినిమా చేసాడు. ఆ సినిమానే స్పైడర్.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమా లో తమిళ్ నేటివిటీ ఎక్కువగా కనిపించడం తో తెలుగు అభిమానులకు అంతగా నచ్చలేదు. స్పైడర్ తర్వాత మురుగదాస్ సర్కార్‌ మరియు దర్బార్‌ సినిమాల ను తెరకెక్కించాడు. ఆ సినిమాలు కూడా అంతగా మెప్పించలేదు.

ఇక దర్బార్ తర్వాత ఇప్పటివరకు మురుగదాస్‌ మరో సినిమాను ప్రకటించలేదు. మధ్యలో గజనీ సీక్వెల్ తీయబోతున్నాడు అంటూవార్తలు వచ్చాయి. కానీ అది కుదరలేదు.. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తన కొత్త సినిమాను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం.శివ కార్తికేయన్‌ తో త్వరలోనే ఓ పాన్‌ ఇండియా సినిమాను ప్రకటించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందింది.. పీరియాడిక్ డ్రామా సెటప్‌లో ఈ సినిమా థీమ్‌ ఉండనున్నట్లు సమాచారం.. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు తమిళంలో మంచి క్రేజ్‌ ఉంది.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపకుంటున్నట్లు సమాచారం..ఈ సినిమాను మురుగుదాస్‌ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.. హీరోయిన్‌గా సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ ను తీసుకోనున్నట్లు సమాచారం..ఈ సినిమాకు సంగీత దర్శకునిగా అనిరుధ్ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version