APTNSF President Pranav Gopal React on Vyooham Movie: ‘వ్యూహం’ సినిమాను ఆపకపోతే సైకో వర్మ కార్యాలయం, ఇంటిని ముట్టడిస్తామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. అవసరం అనుకుంటే సినిమాను ధియేటర్ల వద్ద అడ్డుకుంటామన్నారు. వ్యూహం సినిమాలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లను కించపరిచే విధంగా చిత్రీకరించడం తెలుగు ప్రజలకు అవమానకరం అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో పోర్న్ సినిమాలు చూసే వర్మ లాంటి నీతిమాలిన వ్యక్తికి వైసీపీ వంత పాడుతోందని ప్రణవ్ గోపాల్ మండిపడ్డారు.
వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 28న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. వ్యూహం సినిమా విడుదల చేయకుండా.. చిత్ర నిర్మాతను ఆదేశించాలని పిటిషన్‌లో లోకేశ్ కోరారు.
Also Read: Zomato Orders 2023: వామ్మో.. 2023 లో అన్ని కోట్లకు నూడిల్స్‌ను ఆర్డర్ చేశారా?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘వ్యూహం’. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తీసిన ఈ చిత్రంలో ఏపీ రాజకీయాల‍్ని చూపించనున్నారు. సీఎం కాకముందు వైఎస్ జగన్ జర్నీ ఎలా సాగింది?, ఆ తర్వాత సీఎం ఎలా అయ్యారు? అనే విషయాల్ని ఈ సినిమాలో వర్మ చూపించబోతున్నారు. డిసెంబరు 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస రామకృష్ణ కనిపించనున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.