Rules Change: ఏప్రిల్ 1 వచ్చేసింది.. ఇవాళ్టి నుంచి 8 కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఇలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rules Change: ఎన్నో కష్ట నష్టాలను, పండుగలను చూపించిన మార్చి ముగిసింది.. దాంతో పాటు ఆర్థిక సంవత్సరం కూడా ముగిసింది.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రజల దినచర్య, ఖర్చులు, ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పన్నులు, గ్యాస్ ధరలు, రైల్వే నియమాలు వంటి రంగాల్లో వచ్చిన ఈ మార్పులు ప్రతి కుటుంబ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటో ఒకసారి చూద్దాం.
1. ATM నిబంధనలలో మార్పులు: మొదటగా ATM లావాదేవీల విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై UPI ద్వారా ATM నుంచి నగదు ఉపసంహరణ కూడా ఉచిత లావాదేవీల పరిమితిలోనే లెక్కించబడుతుంది. మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర ప్రాంతాల్లో 3 నుంచి 5 వరకు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కూడా తగ్గించాయి.
Also Read
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
2. కొత్త ఆదాయపు పన్ను చట్టం: పన్నుల వ్యవస్థలో కూడా పెద్ద మార్పు చోటుచేసుకుంది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి వచ్చింది. పన్నుల సరళీకరణకు ఈ చట్టం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జీతాల నిర్మాణం, అలవెన్సులు, పన్ను ప్రణాళికలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
3. స్టాక్ మార్కెట్‌లో అధిక పన్నులు: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి కూడా ఇది ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరిగింది. దీని వల్ల ట్రేడర్లకు అదనపు భారం పడనుంది.
4. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర పెంపు: హైవే ప్రయాణికులకు కూడా ఫాస్టాగ్ ధరలు పెరిగాయి. వార్షిక పాస్ ధర రూ.3,000 నుంచి రూ.3,075కి పెరిగింది. ఇది తరచుగా ప్రయాణించే వారికి కొంత భారం అవుతుంది.
5. కొత్త కార్మిక చట్టం: కొత్త కార్మిక చట్టం అమల్లోకి రావడంతో ఉద్యోగుల జీతాలపై ప్రభావం ఉండనుంది. బేసిక్ సాలరీ కనీసం 50 శాతం ఉండాలని నిబంధన రావడంతో PF కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దీని వల్ల చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.
6. పాన్ కార్డుకు సంబంధించిన మార్పులు: పాన్ కార్డ్‌కు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇకపై ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు అవసరం అవుతాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు, ఆస్తి కొనుగోలు, వాహనాలు కొనుగోలు వంటి సందర్భాల్లో పాన్ చూపించడం తప్పనిసరి అయింది.
7. ఎల్పీజీ ధరలు: గ్యాస్ ధరల్లో మార్పులు ఇప్పటికే కనిపించాయి.. కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.195.50కి పెంచారు.. కోల్‌కతాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.218 పెంపు జరిగింది.. అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు..
8. రైల్వే టిక్కెట్ రద్దు నియమాలు: రైల్వే టికెట్ రద్దు నియమాల్లో కూడా మార్పులు అమల్లోకి వచ్చాయి. ప్రయాణానికి 72 గంటల ముందే రద్దు చేస్తే ఎక్కువ రీఫండ్ లభిస్తుండగా, సమయం దగ్గరపడే కొద్దీ రీఫండ్ తగ్గుతుంది. చివరి 8 గంటల్లో రద్దు చేస్తే ఎటువంటి రీఫండ్ ఉండదు. మొత్తానికి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ఈ కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని, మీ ఖర్చులను సమర్థంగా ప్లాన్ చేసుకోవడం ఎంతో అవసరం.
తాజావార్తలు
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!