బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. JMGS – I పే స్కేల్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్), అసిస్టెంట్ మేనేజర్ (IT) మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
Also Read:PM Modi: రేపు ఏపీకి మోడీ.. అమరావతి పనులు ప్రారంభించనున్న ప్రధాని
అభ్యర్థులు 30 ఏళ్లు కలిగి ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 – రూ.85,920 జీతం అందిస్తారు. దరఖాస్తు ఫీజు SC/ST/PwBD అభ్యర్థులు రూ. 177 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ. 1180 చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
