కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ వేతనంతో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 122 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:IND vs AUS 5th T20: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మ్యాచ్ కి వర్షం అంతరాయం.. 4.5 ఓవర్లకే 52 పరుగులు..
జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇతర అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:CM Revanth Reddy: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు- ఆకట్టుకుంటున్న సైకత శిల్పం
ఆన్‌లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 86,955, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పదవికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,870 జీతం అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 27 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
