Site icon NTV Telugu

CCIL Recruitment 2025: భారీ జీతంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి

Job

Job

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. సమాజంలో గౌరవంగా చూస్తారు. అందుకే యువత అంతా గవర్నెమెంట్ జాబ్స్ కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read:Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

అభ్యర్థులు పోస్ట్ ప్రకారం సంబంధిత రంగంలో వ్యవసాయంలో డిప్లొమా/CA/CMA/MBA/B.Scలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Also Read:Today Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల నుంచి 1.2 లక్షల వరకు జీతం అందిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 1500 చెల్లించాలి. SC/ST/PH కేటగిరీ వారు రూ. 500 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ మే 9 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 24 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Also Read:Terror Conspiracy Case: నేడు సిరాజ్, సమీర్లను కస్టడికి తీసుకోనున్న పోలీసులు

పోస్టుల వివరాలు:
జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-125
జూనియర్ అసిస్టెంట్ కాటన్ టెస్టింగ్ ల్యాబ్-02
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంకేటీజీ)-10
మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాతా-10

Exit mobile version