సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 110 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, ఇతర నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు 30 ఏళ్లు పైబడి ఉండాలి.
Also Read:East Godavari Floods: గోకవరంలో ఆకస్మిక వరదలు.. స్పందించిన కలెక్టర్
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితిలో సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. స్టేజ్-I పరీక్ష రెండు భాగాలుగా నిర్వహిస్తారు. పార్ట్-Iలో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-IIలో సంబంధిత సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. స్టేజ్-Iలో అర్హత సాధించిన అభ్యర్థులను స్టేజ్-II పరీక్షకు ఆహ్వానిస్తారు. స్టేజ్-IIలో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
Also Read:Telangana BJP : సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘించారు.. బీజేపీ ఫిర్యాదు
స్టేజ్-I పరీక్షను SEBI జనవరి 10, 2026న, స్టేజ్-II పరీక్షను ఫిబ్రవరి 21, 2026న నిర్వహిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ. 1000, SC, ST, దివ్యాంగుల అభ్యర్థులకు రూ. 100 చెల్లించాలి. SEBIలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈరోజు, అక్టోబర్ 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు www.sebi.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి నవంబర్ 28, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
