రైల్వే జాబ్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. ఎగ్జామ్ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) గోరఖ్‌పూర్‌లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1104 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా 12వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి.
Also Read:Keir Starmer Aadhaar: ఆధార్‌పై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు .. బ్రెట్ కార్డ్ నమూనాగా ఇండియన్ ఆధార్
అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు కనీసం 15 సంవత్సరాలు మరియు కనీసం 24 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఆహ్వానిస్తారు. అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST, మహిళలు, వికలాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 15 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
