రైల్వేలో జాబ్ కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2,569 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ బోర్డు/ సంస్థల నుండి ఇంజనీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Sushant Singh death : “చేతబడి చేశారు.. ఇద్దరూ కలిసి చంపారు” – సుశాంత్ అక్క సంచలన ఆరోపణలు
స్టేజ్ 1, స్టేజ్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టేజ్ 1 పరీక్షలో, అభ్యర్థులకు గణితం, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్ నుండి 100 మార్కులతో 100 Multiple-choice questions అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి మార్కులో మూడింట ఒక వంతు నెగిటివ్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫేజ్ 2 పరీక్ష నిర్వహిస్తారు. ఫేజ్ 2 పరీక్షలో, అభ్యర్థులకు 150 Multiple-choice questions ఉంటాయి.
Also Read:iQOO Neo 11: మరీ ఇంత బాగుందేందయ్యా ఈ స్మార్ట్‌ఫోన్.. చూస్తుంటేనే కొనాలనిపిస్తోంది!
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం అందిస్తారు. జనరల్, EWS, OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500, SC/ST, మహిళలు, వికలాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 250. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
