ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 2,743 పోస్టులను భర్తీ చేయనున్నది. అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, వారు ITI, BA, BCom, BSc, BBA, లేదా BTech డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:WPL 2026: డబ్ల్యూపీఎల్‌లో ఆడేందుకు ట్రాన్స్‌జెండర్ ప్రయత్నాలు.. ఆర్‌సీబీ కిట్ బ్యాగ్‌తో అనయ!
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ. 12,300, రెండేళ్ల డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 10,900, ట్రేడ్ అప్రెంటిస్ (10వ, 12వ తరగతి)కు రూ. 8,200, ట్రేడ్ అప్రెంటిస్ (ఒక సంవత్సరం ఐటీఐ)కు రూ. 9,600, ట్రేడ్ అప్రెంటిస్ (రెండు సంవత్సరాల ఐటీఐ)కు 10,560 స్టైఫండ్ అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 17 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
