ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నాబార్డ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) షార్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా గ్రేడ్ A రిక్రూట్‌మెంట్ 2025ని ప్రకటించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 91 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్/RDBS) 85, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (లీగల్ సర్వీస్) 2, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ సర్వీస్) 4 పోస్టులు ఉన్నాయి.
Also Read:Spitting on Rotis : అసలు వీడు మనిషేనా.. రోటీలలో ఉమ్మేసిన వంటోడు
ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్/MBA/PGDM/CA/CS/ICWA డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండొద్దు. 30 సంవత్సరాల కంటే మించొద్దు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
Also Read:Tollywood : దుమ్ములేపిన బాలయ్య, వెంకీ.. నిరాశపరిచిన చిరు, మహేశ్, రెబల్ స్టార్
అభ్యర్థులు రూ. 850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, PWBD వర్గాల వారు రూ. 150 చెల్లించాలి. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 8న ప్రారంభమై నవంబర్ 30, 2025 నాటికి పూర్తవుతుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత ఉన్న అభ్యర్థులు NABARD అధికారిక వెబ్‌సైట్ www.nabard.orgని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈలింక్ పై క్లిక్ చేయండి.
