ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో మూడేళ్ల డిప్లొమా, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు.
అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2025 నాటికి లెక్కిస్తారు. అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఇవ్వబడుతుంది. SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. జూనియర్ ఇంజనీర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుండి రూ.1,05,000 వరకు జీతం అందిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 9, 2026. ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
