Site icon NTV Telugu

Indian Air Force Recruitment 2025: గోల్డెన్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్..

Iaf

Iaf

భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సైన్స్ సబ్జెక్టులతో 10+2 (ఇంటర్మీడియట్) విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మొత్తం మార్కులు, ఇంగ్లీషులో 50% మార్కులు సాధించి ఉండాలి.

Also Read:Keerthi Suresh : ఇంటర్ లోనే అతన్ని లవ్ చేశా.. కీర్తి సురేష్‌ షాకింగ్ కామెంట్స్

లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఐటీలో 3 సంవత్సరాల డిప్లొమా. డిప్లొమా కోర్సులో కనీసం 50% మొత్తం మార్కులు, ఇంగ్లీషులో 50% మార్కులు సాధించి ఉండాలి. భౌతిక శాస్త్రం, గణితం వృత్తియేతర సబ్జెక్టులుగా రెండేళ్ల వృత్తి విద్యా కోర్సులు, కనీసం 50% మార్కులు, ఆంగ్లంలో 50% మార్కులు సాధించి ఉండాలి.

Also Read:Love Coupl: పురుగుల మందు తాగి.. ప్రేమ జంట ఆత్మహత్య..

అభ్యర్థుల కనిష్ట వయస్సు 17.5 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష (ఆన్‌లైన్ రాత పరీక్ష), శారీరక దృఢత్వ పరీక్ష, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 550 చెల్లించాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దరఖాస్తు ప్రక్రియ జూలై 11, 2025 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూలై 31, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version