Site icon NTV Telugu

DRDO CEPTAM 11 Recruitment 2025: DRDO లో 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు.. మంచి జీతం

Jobs

Jobs

ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? కెరీర్ సెట్ చేసే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) DRDO CEPTAM 11 నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-BBకి 561, టెక్నీషియన్-Aకి 203 పోస్టులు భర్తీకానున్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టుల కోసం అభ్యర్థులు ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో బి.ఎస్సీ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

Also Read:Minister Nara Lokesh: విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయండి.. కేంద్రానికి లోకేష్‌ విజ్ఞప్తి..

టెక్నీషియన్-ఎ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారత్ లోని గుర్తింపు పొందిన సంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి లెక్కిస్తారు. అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 112,400 వరకు జీతం లభిస్తుంది. టెక్నీషియన్-ఎ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకు జీతం లభిస్తుంది.

Also Read:Road Accident: రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11న ప్రారంభమైంది. ఈ పోస్టులకు అభ్యర్థులు జనవరి 01, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదనంగా, అభ్యర్థులు జనవరి 3వ తేదీ రాత్రి 11:55 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. జనవరి 4, జనవరి 6 మధ్య అభ్యర్థులు తమ ఫారమ్‌లలో దిద్దుబాట్లు చేసుకోవడానికి కూడా సమయం ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version