NTV Telugu Site icon

CISF Recruitment 2025: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు అప్లై చేసుకోండి

Cisf

Cisf

ఉద్యోగం కోసం వెతికి విసిగిపోయారా? జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఇక డోంట్ వర్రీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

Also Read:IPL 2025: ఇది కదా ఐపీఎల్ క్రేజ్.. మ్యాచ్ టిక్కెట్ ఉంటే మెట్రో రైలు, ఎంటీసీ బస్సులలో ప్రయాణం ఉచితం

ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి టెన్త్ పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీబీటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBC/EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. SC/ST/మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.