బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 514 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. అదనంగా, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ICWA, MBA లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్‌లో PGDBM లేదా బ్యాంకింగ్, క్రెడిట్‌లో తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి ప్రాధాన్యత ఉంటుంది.
Also Read:Vijay: డీఎంకే దుష్టశక్తి.. టీవీకే ఫ్యూర్.. ఎన్నికల ర్యాలీలో విజయ్ ఆసక్తికర ప్రసంగం
అభ్యర్థుల వయస్సు నవంబర్ 1, 2025 నాటికి లెక్కిస్తారు. కనీస వయోపరిమితి 25, 28, 30 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 35, 38, 40 సంవత్సరాలు. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు లభిస్తుంది. OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:India-Oman: భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం.. ఇదొక మైలురాయి అన్న మోడీ
గ్రేడ్ స్కేల్-II నెలకు రూ. 67,160 నుండి రూ. 93,960. గ్రేడ్ స్కేల్-III నెలకు రూ. 99,320 నుండి రూ. 1,05,280. గ్రేడ్ స్కేల్-IV నెలకు రూ. 1,14,220 నుండి రూ. 1,20,940 జీతం అందుకోవచ్చు. SC, ST, దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 175. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.850. దరఖాస్తులు డిసెంబర్ 20న ప్రారంభమవుతాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 5, 2026 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
