Site icon NTV Telugu

IAF AFCAT 2026 Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. కొడితే లైఫ్ సెట్

Jobs

Jobs

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగాలునుకునేవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నవంబర్ 17న ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలుకంటున్న అభ్యర్థులు AFCAT 2026 పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. AFCAT 1 2026 కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి పోస్ట్ ప్రకారం సంబంధిత సబ్జెక్టులు/రంగంలో 10+2/ ఇంజనీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ NCC సర్టిఫికేట్ మొదలైన వాటిలో ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read:PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..

AFCAT ఫ్లయింగ్ బ్యాచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు మించకూడదు. గ్రౌండ్ డ్యూటీ/టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 26 సంవత్సరాలుగా నిర్ణయించారు. NCC సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వారి శిక్షణ కాలంలో రూ. 56,100 స్టైఫండ్ లభిస్తుంది. అదనంగా, అభ్యర్థులు వారి శిక్షణ కాలం పూర్తయిన తర్వాత రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు స్టైఫండ్ అందుకుంటారు.

Also Read:Jagtial: తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతున్నారని.. కుమారుడు సూసైడ్..

దరఖాస్తు చేసుకోవడానికి AFCAT ఎంట్రీ పోస్టులకు రూ. 550 చెల్లించాలి. ఈ ఫీజు అన్ని వర్గాలకు ఒకే విధంగా ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఈ పరీక్ష AFCAT ఎంట్రీ కింద ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్, ఫ్లయింగ్ పోస్టులకు అభ్యర్థులను నియమిస్తుంది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 14, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version