కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో డిప్లొమా, B.Tech, B.Sc లేదా BCA డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి అభ్యర్థులను టైర్-I ఆన్‌లైన్ పరీక్ష, టైర్-II స్కిల్ టెస్ట్, టైర్-III ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Cyber Crime : 500 కోట్ల సైబర్ మోసాల వెనుక విజయవాడ యువకుడు.. శ్రవణ్ కుమార్ అరెస్ట్
ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 4 (రూ. 25,500–₹81,100) పే స్కేల్ ఉంటుంది. అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 14, 2025 నాటికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 23, 2025న ప్రారంభమైంది. సెప్టెంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
