NTV Telugu Site icon

Apple Shoe’s : యాపిల్ కంపెనీ బూట్లు.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

Apple Shoes

Apple Shoes

ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ కంపెనీ ఉత్పత్తులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాపిల్ నుంచి ఏ వస్తువు మార్కెట్ లోకి రిలీజ్ అయిన కూడా యూత్ వెంటనే కోనేస్తున్నారు.. ఆ ఫీచర్స్, కాస్ట్ కూడా అన్నిటికన్నా భిన్నంగా ఉంటాయి. అందుకే యాపిల్ ఉత్పత్తులు కొనాలని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు…ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్‌ ఏవైనా, ధర ఎలాగున్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్‌ మరే బ్రాండుకి ఉండదని అందరికీ తెలిసిందే..

కొద్ది రోజుల క్రితం యాపిల్‌ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి అధిక మొత్తంలో అమ్ముడు పోయిన విషయం తెలిసినదే. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్‌లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం.. ఇది నమ్మాల్సిందే..ఆ బూట్లు ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు. విషయంలోకి వెళితే, దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్లను మార్కెట్లో వేలం పెట్టింది…

ఆ బూట్లను 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేయగా యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 అంటే సుమారు 41 లక్షల రూపాయలకు అమ్మారన్నమాట. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది.. ఇటీవల వేలంలో యాపిల్‌ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. పాత వస్తువులే అయిన కూడా డిమాండ్ ఎక్కువ..గత నెలలో, ఐఫోన్‌ 2007 మొదటి-ఎడిషన్‌ను $190,000కి విక్రయించగా, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు చెందిన ఒక జత బిర్కెన్ స్టాక్ చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి.అంటే ఇక మీరే అర్ధం చేసుకోండి..