Site icon NTV Telugu

Apple iPad Air: యాపిల్ నుంచి సరికొత్త ‘ఐప్యాడ్‌ ఎయిర్‌’.. ప్రత్యేక ఆకర్షణగా ఎం2 ప్రాసెసర్‌!

Apple Ipad Air

Apple Ipad Air

Apple iPad Air Price and Features Details: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్‌లను లాంచ్ చేస్తూ.. దూడుకుపోతుంది. గతేడాది 15 సిరీస్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త ‘ఐప్యాడ్‌ ఎయిర్‌’ను యాపిల్ లాంచ్ చేసింది. మంగళవారం (మే 7) జరిగిన ‘లెట్‌ లూజ్‌’ కార్యక్రమంలో ఐప్యాడ్‌ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఎయిర్‌తో పాటు ఐప్యాడ్ ప్రో కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌లో శక్తిమంత ఎం2 చిప్‌ను అమర్చారు. ఐప్యాడ్‌ ఎయిర్‌ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఐప్యాడ్‌ ఎయిర్‌ 11 ఇంచెస్, 13 ఇంచెస్ డిస్‌ప్లేలతో యాపిల్ కంపెనీ తీసుకొచ్చింది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్‌లతో ఇది లభించనుంది. 11 ఇంచెస్ ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.59,900గా ఉంది. అదే వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.74,900గా ఉంది. 13 ఇంచెస్ ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.79,900 ఉండగా.. వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.94,900గా ఉంది.

Also Read: Google Pixel 8a Price: ‘గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ’ ఫోన్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ ఇవే!

యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఐప్యాడ్‌ ఎయిర్‌లను ఆర్డరు చేసుకోవచ్చు. మే 15 నుంచి ఇవి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో లభిస్తాయి. ఐప్యాడ్‌ ఎయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఎం2 ప్రాసెసర్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. మల్టీటాస్కింగ్‌ చేసేందుకు ఎం2 సాయపడుతుంది పేర్కొంది. వైఫై 6ఈ కనెక్టివిటీ, యాపిల్‌ పెన్సిల్‌ హోవర్‌ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Exit mobile version