ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. మీ లక్ తో పాటు మీ కుటుంబ స్థితిని మార్చుకునే ఛాన్స్ వచ్చింది. కాస్త డెడికేషన్ తో ట్రై చేస్తే చాలు కేంద్ర భద్రతా బలగాలల్లో ఉద్యోగం సాధించొచ్చు. నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026 కి సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 25487 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read:Amaravati Land Pooling: ఏపీ రాజధానిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఉత్తర్వులు జారీ..
బిఎస్ఎఫ్ 616 పోస్ట్‌లు, సిఐఎస్ఎఫ్ 14595 పోస్ట్‌లు, సిఆర్‌పిఎఫ్ 5490 పోస్ట్‌లు, ఎస్.ఎస్.బి. 1764 పోస్ట్‌లు, ఐటీబీపీ 1293 పోస్ట్‌లు, ఎఆర్ 1706 పోస్ట్‌లు, ఎస్.ఎస్.ఎఫ్. 23 పోస్ట్‌లు భర్తీ కానున్నాయి. వేల సంఖ్యలో ఉన్న ఈ పోస్టులను అస్సలు వదలకండి. SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read: Metro Struked in Subway: సబ్‌వే కింద సడెన్‌గా ఆగిపోయిన మెట్రో.. భయపడిపోయన ప్రయణికులు
జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మాజీ సైనికులు, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు పీజు నుంచి మినహాయింపునిచ్చారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
