NTV Telugu Site icon

APECET 2024 Notification: ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే…

Apecet

Apecet

ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.. జేఎన్‌టియూ అనంతపురం ఆధ్వర్యంలో ఈ ఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.. రాష్ట్రంలోని సెట్ల నిర్వహణ షెడ్యూల్‌ను ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తాజాగా ఈసెట్ 2024 నోటిఫికేషన్‌ను ఈసెట్ కన్వీనర్ విడుదల చేశారు.. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ పరీక్షల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అర్హతలు..

పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు..

అప్లికేషన్ ఫీజు..

రిజిస్ట్రేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు..

దరఖాస్తు విధానం.. ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం..

ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.

పరీక్ష విధానం..

మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి..

ముఖ్యమైన తేదీలు..

నోటిఫికేషన్ : 14.03.2024.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

పరీక్ష తేది: 05.05.2023.

పరీక్షసమయం..

ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.2.30 గం.-సా.5.30 గం. వరకు..

ఈ పరీక్షల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://cets.apsche.ap.gov.in/ECET ఈ వెబ్ సైట్ లో చూడగలరు..