NTV Telugu Site icon

Wedding Feast: ముక్కల్లేవు.. ఆ పెళ్లికి వెళ్తే జస్ట్ పిజ్జానే

Food

Food

పెళ్లి అంటే అక్షింతలు, వేదమంత్రాలు, డీజే డ్యాన్సులు, నవ్వులు, చమత్కరాలు, ఆనందాలు మాత్రమే కాదు.. ఫుడ్ కూడా ముఖ్యమే.. పెళ్లికి వచ్చిన చాలా మంది అతిథులు లేదా స్నేహితులు వేడుకలో వడ్డించే ఆహారంపై కూడా ఫోకస్ పెడతారు. అయితే ఈ వంటకాల్లో నాన్ వెజ్, వెజ్ ఐటెమ్స్ తో పాటు ఇతర స్నాక్స్ కూడా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే టొరంటోలోని ఓ ఫ్యామిలీ మాత్రం సాంప్రదాయేతర అలవాటును కాకుండా మెక్ డోనాల్డ్స్ అందించే స్పెషల్ ఫుడ్ ను మెనూలో పెట్టింది.

Also Read: Dogs Attacks: కాజిపేట్ లో చిన్నారులపై కుక్కదాడి.. అధికారులపై స్థానికులు ఆగ్రహం

ఇజ్జీ బారెటో, ఆమె బాయ్ ఫ్రెండ్ జస్టిన్ అక్టోబర్ 15, 2022న వివాహం చేసుకున్నారు. వారి పెళ్లిలో సంప్రదాయ క్యాటరింగ్ కాకుండా.. మెక్ డోనాల్డ్స్ అందించే 60వేల రూపాయల విలువ గల ఆహారాన్ని ఆర్డర్ చేశారు. ఈ ఫుడ్ ఐటెమ్స్ లో డబుల్ చీజ్ బర్గ్ లు, 100 చికెన్ ముక్కలు ఉన్నాయి. 150 పోర్షన్ ల ప్రైస్ ను ఆర్డర్ చేయడానికి వీరు ఉబర్ ఈట్స్ ను ఉపయోగించారు.

Also Read: Pakistan: నీళ్లల్లో దూకి మరీ రిపోర్టింగా.. జర్నలిస్ట్ అంటే నువ్వే బాసూ…

ఈ విషయంపై స్పందిచిన బారెటో.. మెక్ డోనాల్డ్స్ ఫుడ్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరని వెల్లడించారు. అంతే కాదు ఈ ఆహారంలో కొంత భాగాన్ని అతిథుల్ని తమ ఇంటికి కూడా తీసుకువెళ్లొచ్చని వారు చెప్పారు. చాలా మంది అతిథులు- కుటుంబం సభ్యులుతో పాటు ఇతర వ్యక్తులను సంతోషపెట్టడానికి సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని తెలుస్తుంది. కానీ ఇది మీ పెళ్లి రోజు.. కాబట్టి మీకు సంతోషాన్నిచ్చేది చేయండంటూ బారెటో చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ పుడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బారెటో చేసిన ఈ పోస్టుపై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.