NTV Telugu Site icon

AP Rains: 4 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ!

Telangana Ap Rains

Telangana Ap Rains

పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.

Also Read: YCP vs TDP: కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నేటి సర్వసభ్య సమావేశంకు భారీ బందోబస్తు!

బుధవారం (డిసెంబర్ 25) వరకు సముద్రంలో గంటకు గరిష్ఠంగా 55 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. వర్షం పడే సమయంలో కూడా గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నంబరు హెచ్చరిక జారీ చేయనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్ 26 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. దాదాపు వారం రోజులుగా అల్పపీడనం ప్రయాణం కొనసాగుతోంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో.. వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణుల అంచనా. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు. దాదాపు అయిదు రోజులుగా మత్స్యకారులు వేటకు వెళ్లడం లేదు. మరో నాలుగు రోజులు కూడా పడవలు ఒడ్డుకే పరిమితం కనున్నాయి.