NTV Telugu Site icon

AP Rains: తీవ్ర అల్పపీడనం ప్రభావం.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

Ap Rains (2)

Ap Rains (2)

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం తీరానికి సమాంతరంగా వెళుతున్న కారణంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు ఉండడంతో.. రైతుల్లో టెన్షన్ పెరుగుతోంది. కోత కోసి పొలాలలో ఆరబెట్టిన వరి పంట దెబ్బతింటుందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది.

పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో వర్షాలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని గిరి రైతులు పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఒక్క అనకాపల్లి జిల్లాలోని ఖరీఫ్ సీజన్లో 56,410 హెక్టార్లలో వరి సాగు జరుగుతోంది. ఇప్పటివరకు 38 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరి పంట కోత వాయిదా వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే సూచనలు ఇచ్చింది. భారీగా పెట్టుబడులు పెడితే.. అకాల వర్షాలు నిండా ముంచేలా వుందనే ఆందోళన కనిపిస్తోంది.

Show comments