AP SSC Results 2026: ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..

Ap Ssc Results 2026

Ap Ssc Results 2026

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 2026 టెన్త్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ సేవ ‘మన మిత్ర’, లీప్ మొబైల్ యాప్, డిజిలాకర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సంబంధిత పాఠశాల హెడ్‌మాస్టర్ల లాగిన్‌లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంచారు.

Read Also: Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్‌, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నప్పటికీ, విద్యారంగంలో సాధించిన పురోగతి తనకు మరింత సంతృప్తిని ఇస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఈసారి గణనీయమైన మెరుగుదల నమోదవడం గర్వకారణమని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25 శాతంగా నమోదు కాగా, గత ఏడాది ఇది 81.14 శాతంగా ఉంది. అమ్మాయిలు.. అబ్బాయిల కంటే మెరుగైన ఫలితాలు సాధించారు. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 87.90 శాతం కాగా, అబ్బాయిలది 82.68 శాతంగా నమోదైంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో కూడా ఫలితాలు మెరుగుపడ్డాయి. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి 78.39 శాతంకు పెరిగింది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ మరియు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. వీటిని అధికారిక వెబ్‌సైట్, మన మిత్ర వాట్సాప్ సేవ, డిజిలాకర్ ద్వారా విద్యార్థులు పొందవచ్చు. మరోవైపు, ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారు నిరుత్సాహపడవద్దని, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల సహకారంతో మరింత బలంగా తిరిగి రావచ్చని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తుకు విద్యార్థులే బలం అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి విజయవంతం కావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఎన్టీవీతో ఏపీ టెన్త్ ఫలితాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి..

AP 10th Results 2026 | AP SSC Results 2026