Site icon NTV Telugu

AP 10th Results 2024: నేడు టెన్త్‌ ఫలితాలు విడుదల..

Ap 10th Results

Ap 10th Results

AP 10th Results 2024: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న టెన్త్‌ ఫలితాల విడుదలకు సమయం వచ్చేసింది.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌.. వెబ్‌సైట్‌లో 2023–24 ఎస్ఎస్‌సీ ఫలితాలను విడుదల చేయనున్నారు.. ఇక, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్‌గా ఈ పరీక్షలు రాశారు..

Read Also: Vontimitta Kodanda Rama Kalyanam: నేడు పున్నమి వెలుగుల్లో కోదండరాముడి కళ్యాణం.. సిద్ధమైన ఒంటిమిట్ట

కాగా, ఈసారి ఏపీలో 3,473 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు నిర్వహించారు.. రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాయగా.. 1.02 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు.. ఇక, గత ఏడాది మే 6వ తేదీన ఫలితాలు విడుదల కాగా.. ఈ సారి మరింత ముందుగానే ఫలితాలు వెల్లడిస్తోంది విద్యాశాఖ.. అయితే, సోమవారం టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, ఏపీ టెన్త్‌ ఫలితాలను మీ కోసం అందించనుంది ఎన్టీవీ తెలుగు వెబ్‌సైట్‌.. https://ntvtelugu.com కి వెళ్లి.. మీ హాల్ టికెట్‌ నంబర్‌ ఎంట్రీ చేస్తే.. ఫలితాలు చూసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.

Exit mobile version