NTV Telugu Site icon

Notices To Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్‌ నోటీసులు..

Thammineni Seetharam

Thammineni Seetharam

Notices To Rebel MLAs: రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రెబల్‌ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు.. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే, రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి రెబల్‌ ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు జారీ చేశారు.. రేపు ఉదయం విచారణకు రావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు స్పీకర్.. ఇక, రేపు మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్‌, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌, మద్దాలి గిరికి నోటీసులు ఇచ్చారు. విచారణకు పిలిచినట్టు పిటిషనర్, టీడీఎల్పీ విప్ స్వామికి ఇంటిమేట్ చేసింది స్పీకర్ పేషీ. విచారణ సమయంలో హాజరు కావాలని స్వామికి సూచించారు.

Read Also: SEBI Warning: సెబీ హెచ్చరిక.. అధిక రాబడిని క్లెయిమ్ చేస్తున్న కంపెనీల పట్ల జాగ్రత్త

అయితే, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను మూడోసారి విచారణకు పిలిచారు స్పీకర్‌ తమ్మినేని.. ఇక, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే మూడుసార్లు విచారణ కొనసాగింది.. మరోవైపు ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌ ఎదుట హాజరయ్యారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. ఒక్కసారి హాజరయ్యారు రెబెల్ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి.. అసలు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు వల్లభనేని వంశీ మోహన్‌, కరణం బలరాం, మద్దాలి గిరి.. కాగా, ఈ నెల 12న విచారణకు రావాలని ఇంతకు ముందు స్పీకర్ నోటీసులు జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని స్పీకర్‌కు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు లేఖ పంపిన విషయం విదితమే కాగా.. రేపు స్పీకర్ ఎదుట హాజరు కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అధికారులు లేఖలు పంపారు.