Site icon NTV Telugu

Speaker Ayyanna Patrudu: కోడికి.. గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారు..!

Speaker Ayyanna Patrudu

Speaker Ayyanna Patrudu

Speaker Ayyanna Patrudu: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకపోవడంతో రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తున్నాం అంటూ హాట్‌ కామెంట్స్ చేశారు.. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీ నెలా జీతాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.. అయితే, జీతం తీసుకుని డ్యూటీ చేయనంటే ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం.. అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు..? అని నిలదీశారు.. అసలు.. కోడికి… గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఫైర్‌ అయ్యారు..

Read Also: SSMB 29 : బాహుబలి రేంజ్ లో సెట్ వేయిస్తున్న రాజమౌళి.. ఏంట్రా ఇది

మరోవైపు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత ఆర్కే రోజాపై హాట్ కామెంట్లు చేశారు అయ్యన్నపాత్రుడు.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారన్న ఆయన.. అటువంటివి అన్నీ సెల్ ఫోన్ ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి.. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సెల్ ఫోన్లు కు కూడా సెన్సార్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఆ దిశగా మేధావులు పిల్ దాఖలు చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..

Exit mobile version