Site icon NTV Telugu

AP Skill Development: ప్రతి నెల 52 జాబ్‌ మేళాలు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌..!

Ajay Reddy

Ajay Reddy

AP Skill Development: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి నెల 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం అని వెల్లడించారు ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మాన్‌ అజయ్‌ రెడ్డి.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రెండో సారి అవకాశం దక్కించుకున్నారు అజయ్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి జిల్లాలో జాబ్ మేళాలు పెడుతున్నాం.. ప్రతి నెల 52 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. ఇక, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అని పేర్కొన్నారు. పదో తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు డ్రాప్ అవుట్స్ గుర్తించి శిక్షణ ఇస్తున్నాం అని తెలిపారు. అయితే, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే కాలేజ్ లు కొంత ఆలస్యం అయ్యాయి.. సాధ్యమైనంత త్వరగా కాలేజ్ లు ప్రారంభిస్తాం అని తెలిపారు ఏపీ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మాన్‌ అజయ్‌ రెడ్డి. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విదితమే.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేయగా.. ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఇలా అన్ని కోర్టుల్లోనూ చంద్రబాబు పిటిషన్లపై విచారణ సాగుతోంది.

Read Also: Tayyip Erdogan: “హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ కాదట”.. టర్కీ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version