AP weather Update Today: కరువు భయం కమ్ముకున్న వేళ ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రాష్ట్రంకు వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నాయి.
Also Read: Naveen Nischal: సస్పెన్షన్ కానుకగా ఇచ్చినా.. బ్రతికున్నంత వరకు వైసీపీలోనే!
వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు బలమైన గాలులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు, రేపు బారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంమీ అత్యధిక వర్షపాతం నమోదు అయింది. వర్షాలు లేక అల్లాడుతున్న రైతాంగానికి ఇది చల్లని కబురు అనే చెప్పాలి.
