Site icon NTV Telugu

Employees Retirement Age: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మరోమారు పెరగనుందా..?

Ap Govt

Ap Govt

Employees Retirement Age: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలతో పాటు 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశం ఆన్‌లైన్ విధానంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, కేశవ్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి నారాయణ అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

JD Vance: జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు.. అయితే!

సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు అంశాన్ని చర్చించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వయోపరిమితితో కొనసాగుతున్న 2,831 మంది ఉద్యోగుల పరిస్థితిపై సబ్ కమిటీ దృష్టి సారించింది. ఒకవేళ రిటైర్మెంట్ వయస్సు పెంచినట్లయితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందనే అంశాన్ని సభ్యులు విశ్లేషించారు. జీతాలు, పెన్షన్లు, ఇతర ఆర్థిక బాధ్యతలపై ప్రభావాన్ని సమీక్షించారు. కార్పొరేషన్‌ల వారీగా ఉద్యోగుల సంఖ్య, వయోపరిమితి పెంపుతో వచ్చే అదనపు ఆర్థిక భారం వివరాలను సేకరించి మరోసారి సమావేశం నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక సిద్ధం చేసిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

IP66+IP68+IP69 రేటింగ్స్, 120Hz డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో OPPO A6 Pro 5G భారత్ లో లాంచ్.. ధర ఎంతంటే..?

Exit mobile version