Site icon NTV Telugu

Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్‌!

Borugadda Anil

Borugadda Anil

బోరుగడ్డ అనిల్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు గుంటూరు ఆరవ అదనపు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్‌ విధించడంతో పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బోరుగడ్డ అనిల్‌ను తరలించారు. పీటీ వారెంట్ మీద అనంతపురం జైలు నుంచి గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. పెదకాకాని మండల సర్వేయర్‌ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో అనిల్‌కు రిమాండ్‌ పడింది.

Also Read: AP Cabinet Meeting: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 500 ఎకరాలు.. అమరావతిలో లా యూనివర్సిటీ!

తన స్థలానికి సంబంధించిన సర్టిఫికెట్‌ ఇవ్వాలంటూ 2016 మే 9న పెదకాకాని మండల సర్వేయర్‌ మల్లికార్జునరావును బోరుగడ్డ అనిల్‌ బెదిరించారు. తన విధులకు ఆటంకం కలిగించి బెదిరించడంపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. గత ఎనిమిది ఏళ్లుగా ఈ కేసులో కోర్టుకి అనిల్ హాజరుకాలేదు. దీంతో నేడు పీటీ వారెంట్‌పై అనంతపురం జైలు నుంచి పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మే మూడో తేదీ వరకు రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు అనిల్‌ను తరలించారు.

Exit mobile version