Site icon NTV Telugu

AP Liquor Scam: రాజ్‌ కసిరెడ్డి తొలి రోజు కస్టడీ పూర్తి!

Raj Kasireddy

Raj Kasireddy

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి) తొలి రోజు కస్టడీ పూర్తయింది. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు సిట్ ఆయన్ను విచారించింది. లిక్కర్ అమ్మకాలు, డిస్టలరేస్ నుంచి ముడుపుల వసూలు అంశాలపై రాజ్‌ కసిరెడ్డిని
సిట్ విచారించింది. లిక్కర్ పాలసీ, ప్రైవేట్ వ్యక్తులతో మీటింగ్స్, హవాలా వ్యవహారంపై ఆరా తీసింది. సిట్ అధికారుల ప్రశ్నలకు రాజ్‌ కసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.

Also Read: Group 1 Exams 2025: రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే!

రాజ్‌ కసిరెడ్డి టీమ్‌లో ఉన్న చాణక్య, దిలీప్, అవినాష్ రెడ్డి సహా ఇతరులకు ఆదేశాలు ఎవరు చెబితే ఇచ్చారని కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని సిట్ ప్రశ్నించింది. ప్రభుత్వంలో ఎవరు ప్రోద్బలంతో లిక్కర్ సిండికేటు నడిపారని, స్కాంలో వసూలు చేసిన డబ్బు ఎక్కడకు మల్లించారని, మల్లించిన డబ్బు ఎవరెవరికి ఇచ్చారని ప్రశ్నల వర్షం కురుపించగా.. రాజ్‌ కసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదు. రేపు కూడా రాజ్‌ కసిరెడ్డిని సిట్ విచారించనుంది.

Exit mobile version