ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టానికి (పీఎంఎల్‌ఏ) చట్టం కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే సిట్ అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ.. సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించింది.
ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ అయింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఈ బ్రాండ్ భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటికే సిట్ అధికారులు నుంచి మద్యం కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఈడీ సేకరించింది. ఇక వరుసగా దర్యాప్తు ప్రారంభించాలని ఈడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ చార్జిషీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించింది.
