ఈరోజు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మన మిత్ర వాట్సప్ యాప్‌లోనూ రిజల్ట్స్ పొందవచ్చు. వాట్సప్ నంబరు 9552300009కు ‘హాయ్’ అని ఎస్‌ఎంఎస్ చేసి.. ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేస్తే పీడీఎఫ్ రూపంలో ఫలితాలు వస్తాయి.
వాట్సప్ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టడం.. లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయి చెక్ చేసుకోవాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ సూచించింది. మొదటిసారి వెబ్‌సైట్‌లో డైరెక్టుగా ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఇంటర్ మొదటి, రెండో సంవత్సరానికి 10,17,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గత నెల 20తో పరీక్షలు ముగిశాయి. గత ఏడాది కూడా ఏప్రిల్ 12నే ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. ఎక్స్ ద్వారా ఫలితాలను మంత్రి విడుదల చేయనున్నారు.