Site icon NTV Telugu

Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

Call Off Strike

Call Off Strike

Call Off Strike: నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల్లో సుమారు రూ. 1000 కోట్లను 10రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వటంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మిగిలిన వెయ్యి కోట్ల బకాయిలను కూడా క్లియర్ చేసేందుకు సుముఖతను వ్యక్తం చేయటంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు చేపట్టిన సమ్మెను ప్రస్తుతానికి విరమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర కార్యవర్గం ప్రకటించింది.

ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలు తీరును ఆషా ప్రతినిధులతో రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చించారని.. ఆషా రాష్ట్ర అధ్యక్షుడు డా. విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి శౌరభగౌర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్, డిప్యుటీ సెక్రటరీ సూరజ్ గనోరే, ఆషా కార్యదర్శి డాక్టర్ శ్రీ సి అవినాష్ కుమార్, ఆషా కోశాధికారి డాక్టర్ శ్రీ గిరి, కిమ్స్ హాస్పిటల్ ఎండి డాక్టర్ శ్రీ భాస్కరరావు, డాక్టర్ ఎన్టీర్ వైద్య సేవ ట్రస్ట్ అదనపు సిఇఒ అప్పారావు పాల్గొని పథకం అమలుతీరుపైన, బకాయిలు చెల్లింపు అంశంపైనా చర్చించారని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

నెట్వర్క్ హాస్పటల్స్ బిల్లులను ప్రతినెల రూ.150 కోట్ల నుండి రూ.170 కోట్ల వరకు క్లియర్ చేసేందుకు కూడా రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిందని, యూనివర్సల్ హెల్త్ స్కీంను అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు ఆషా ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ అంశాలకు సంబంధించిన సమావేశపు మినిట్స్ ను కూడా ఆషా రాష్ట్ర కార్యవర్గానికి పంపించారని అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు.

బకాయిలు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆషా సంతృప్తిని వ్యక్తంచేసిందని, అయితే గత అనుభవాల దృష్ట్యా తమ ఆందోళనను తాత్కాలికంగా మాత్రమే విరమించాలని ఆషా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు. మరోసారి ఆషా ఎలాంటి ఆందోళనలకు దిగకుండా తమకు సహకరించాలని, హామీ ఇచ్చిన విధంగా ఈ వెయ్యి కోట్లు 10 రోజుల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఖాతాలకు జమ అయ్యేవిధంగా తగు చర్యలు తీసుకుని, మరోసారి ఆషా ఎలాంటి ఆందోళనలకు దిగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని ఆషా విన్నవించింది.

Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయాల్లో రాష్ట్రప్రభుత్వం తీసుకునే ఏ కార్యక్రమానికైనా ఆషా తన పూర్తి సహకరాన్ని అందిస్తుందని అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో మాత్రమే తాము ఆందోళనకు దిగుతున్నామని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతంకాకూడదని కోరుకుంటున్నామని ఆషా రాష్ట్ర కార్యవర్గం తెలిపింది.

Exit mobile version