Parakamani Case: ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారిన టీటీడీ పరకామణి కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. కేసు దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇదే సమయంలో.. పరకామణిలో టెక్నాలజీ తీసుకురావడం.. మానవ ప్రమేయం తగ్గించడంపై ఇంకా మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వాలని టీటీడీ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. ఇక, శ్రీవారికి ఇచ్చిన కానుకలు పొర్లించడం, తొక్కడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడింది.. మరోవైపు, భక్తులను బట్టలు విప్పి తనిఖీలు చేయడం వారి మనోభావాలు దెబ్బతీయడమే అని వ్యాఖ్యానించింది.. ఈ కేసులో సీఐడీ, ఏసీబీ అధికారులు కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కేసుల నమోదులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ముందుకు వెళ్లాలని సీఐడీ, ఏసీబీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
Parakamani Case: పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది మనోభావాలు దెబ్బతీయడమే..!

Tirumala Parakamani Case