GITAM University: గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రూ. 5000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గీతం సంస్థకు కట్టబెట్టడంపై హైకోర్టులో పిల్ వేశారు విశాఖ న్యాయవాది గ్రేస్. ఆయన రాజకీయ ప్రయోజనాలతో ప్రజలకు సంబంధించిన భూములను ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకమని అన్నారు పిటిషన్ తరపు న్యాయవాది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు మార్గాల ద్వారా ప్రభుత్వ భూములను గీతం సంస్థకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తోందని వాదించారు.
Minister Seethakka : మేడారం జాతర దిగ్విజయం.. దొంగ ప్రచారాలకు తావులేదు..
అయితే 51.2 ఎకరాల భూమిని గీతం సంస్థకు ప్రభుత్వం కట్టబెడుతనేందుకే ఎటువంటి ఆధారాలు లేవన్నారు ప్రభుత్వ లాయర్లు. అయితే చట్టపరంగానే భూమిని గీతం సంస్థకు ప్రభుత్వం బదలాయిస్తుందని యూనివర్సిటీ తరపు న్యాయవాదులు వాదించారు. పిల్ ను కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. పిల్ ను పూర్తిగా విచారించకుండా కొట్టేయలేమని ఏపీ హైకోర్ట్ తెలిపింది. పూర్తి ఆధారాలతో కౌంటర్ దాగులు చేతి ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్ట్.
Student S*uicide Case: విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పలువురు అరెస్ట్!
