ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,896 ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు..
డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్‌లలో ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి..
వయసు..
జూలై 1, 2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ వర్గాలకు అయిదేళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాలకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు..
ఎంపిక విధానం..
ఈ పోస్ట్‌లకు సంబంధించి తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితా విడుదల చేస్తారు. అనంతరం జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో తుది జాబితా రూపొందించి.. నియామకాలు ఖరారు చేస్తారు..
జీతం..
అభ్యర్థులు రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా..ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలోనూ మెరిట్ జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. ఆకర్షణీయమైన వేతనంతో కొలువు సొంతమవుతుంది. ప్రారంభ వేతన శ్రేణి రూ.22,460-రూ.72,810గా జీతాన్ని చెల్లిస్తారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 11, 2023
ఫీజు చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్ 10, 2023
హాల్ టికెట్ జారీ: డిసెంబర్ 27 నుంచి
పరీక్ష తేదీ: డిసెంబర్ 31, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apaha-recruitment.aptonline.in/ ను సందర్శించగలరు..