Site icon NTV Telugu

APCOB Chairman: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే!

Ganni Veeranjaneyulu

Ganni Veeranjaneyulu

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్‌ స్థానాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది. ఏపీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఛైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (డీసీసీబీ) ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రకాశం జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గా కామేపల్లి సీతారామయ్య నియమితులయ్యారు. కాకినాడ జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ ఛైర్మన్‌గా తుమ్మల రామస్వామి నియమితులయ్యారు. ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఛైర్మన్‌గా చాగంటి మురళీ కృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా కసిరెడ్డి శ్యామల, కాకినాడ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా పిచ్చేటి చంద్రమౌళిని ప్రభుత్వం నియమించింది.

Exit mobile version