ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ సదస్సు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు సదస్సు కొనసాగనుంది. అయితే.. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, మధుసూధన్ రెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాకు చెందిన ఫారెస్ట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల తర్వాత ఈ సమావేశం నిర్వహించామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో అటవీశాఖకు కొత్త రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలకు అడవుల ఉపయోగాలను తెలియజేస్తామని, అడవులను కాపాడటంలో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని మధుసూధన్ రెడ్డి వెల్లడించారు. ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించామని, పట్టణాలకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతాలను ప్రజలకు చేరువ చేస్తామని, రైతుల సహకారంతో అగ్రో ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తున్నామని, క్లైమేట్ ఛేంజ్ పై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు మధుసూధన్ రెడ్డి.
Also Read : Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండిసంజయ్ సవాల్.. యాదాద్రి గుట్టకు వస్తావా టైం, డేట్ నువ్వే చెప్పు..
మొక్కలను విస్తారంగా పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, గ్రీన్ కారిడార్ పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎర్రచందనం రవాణా కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పని చేస్తోందని మధుసూధన్ రెడ్డి పేర్కొన్నారు. ఒడిశా నుంచి ఉత్తరాంధ్రలోకి వచ్చిన ఏనుగులు తిరిగి వెనక్కి వెళ్లడం లేదని, మన ప్రాంతంలో ఆహారం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, అందుకే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని, ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు చిరుతలు ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో సంచరిస్తున్నాన్న మధుసూధన్ రెడ్డి.. ఇప్పటి వరకు చిరుతల ఆనవాళ్లు గుర్తించామన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు శాఖల సమన్వయంతో చిరుతలను పట్టుకుంటామని మధుసూధన్ రెడ్డి స్పష్టం చేశారు.
