ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మొదలయ్యాయి సాధారణంగా వేసవి కాలం తర్వాత జూన్ నెలలో కురిసే తొలకరి వానల కోసం జనాలు ఎదురు చూస్తారు. కానీ ఈసారి మాత్రం వర్షాలు త్వరగా కురుస్తున్నాయి.. దీంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో పత్తికొండకి చెందిన ఒక వ్యక్తికి వజ్రం దొరికింది. దాన్ని వజ్రాల వ్యాపారవేత్త 2 లక్షల క్యాష్ మరియు 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసారు. అయితే వజ్రం విలువ 5 లక్షలు పైగానే ఉంటుంది అని అంచనావేశారు. ఇంకా ఏముంది ప్రజలందరూ వజ్రాల కోసం పరుగులు తీస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.