Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరిని వదలమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఏ1 జనార్ధన్ అరెస్ట్ చేశామని చెప్పారు. పేద వాళ్ల ఆరోగ్యం కంటే కూటమి ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని వెల్లడించారు. ప్రస్తుతానికి కొన్ని షాకింగ్ వార్తలు వచ్చాయి, వాటిని ఇప్పుడే చెప్పను, విచారణ తర్వాత చెబుతామని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తెచ్చామని పేర్కొన్నారు.
READ ALSO: Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?
ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నకిలీ మద్యం కేసులో సిట్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఆఫ్రికాలో మూలాలు నేర్చుకున్నారని, వారి ఇక్కడ ఆటలు సాగవని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ ముసుగు తొడుక్కొని పని చేస్తున్నారని, వారిని వదిలి పెట్టమని అన్నారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. వీరిలో 16 మందిని అరెస్ట్ చేశామని, ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేసి 4 పీటీ వారెంట్‌లు నమోదు చేశామన్నారు. ఈ కేసు మూలాల్లోకి వెళ్తుంటే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయని అన్నారు. తీగ లాగితే డొంక కదులుతోందని సీఎం చెప్పారు. దీనిపై మరింత విచారణ కోసం సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఎక్సైజ్ శాఖలో మరొకరితో కలిపి సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ములకల చెరువు ఘటన బయట పెట్టిందే తమ ప్రభుత్వం అని, నిందితులను అరెస్టులు చేసింది, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది కూడా తమ ప్రభుత్వమే అని అన్నారు. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని, కేసు నుంచి ఎవరూ కూడా తప్పించుకోలేరని అన్నారు. నిందితులు నకిలీ మద్యం తయారు చేయడాన్ని ఆఫ్రికాలో నేర్చుకున్నారని, అక్కడ నేర్చుకుని ఏపీలో అమలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని విమర్శించారు. దీని వెనక ఎవ్వరున్నా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ పార్టీ వాళ్లపై ఆరోపణలు ఉన్నా సస్పెండ్ చేశామన్నారు. నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నామని, అందుకే యాప్ తెచ్చామని స్పష్టం చేశారు.
READ ALSO: AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ : సీఎం చంద్రబాబు
